West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. మంగళవారం సాయంత్రంతో తొలిదశ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది.
ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషం వరకు ఇరు పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.
Read Also: Jhalmuri : మోడీ తిన్నాడు..ఇప్పుడు దేశ వ్యాప్తంగా డిమాండ్

క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీ పర్యటన
రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కోల్‌కతా, పూర్బా మిడ్నాపూర్, నార్త్ 24 పరగణాల జిల్లాల్లో ఆమె బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, బీజేపీని నిరోధించాలని ఆమె ప్రజలను కోరుతున్నారు.
West Bengal Elections: అమిత్ షా సుడిగాలి ప్రచారం
మరోవైపు, బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తన అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, బెంగాల్‌లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిస్తున్నారు.
తొలిదశ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండటంతో, అందరి దృష్టి పోలింగ్ రోజుపై నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
మోదీ మహిళా బిల్లును అడ్డుకున్నారు, ప్రతిపక్షం కేవలం డీలిమిటేషన్‌పైనే పోరాడింది: ఖర్గే

