TG Police Recruitment 2026: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఇతర పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో (సెప్టెంబర్ 16) ముగియనుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు నేటి సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా అప్లికేషన్ సమర్పించాలి. చివరి రోజు కావడంతో సర్వర్‌పై భారం పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also : Mahesh Kumar Goud: ఐదుగురు బీసీలను కేబినెట్‌లోకి తీసుకోవాలి: మహేశ్ గౌడ్
Deadline for Telangana police job applications ends today.
TG Police Recruitment 2026: అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు
పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వయసు కారణంగా గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థులకు ఈసారి ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం లభించింది.
అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తుల గడువును కూడా పొడిగించింది. దీంతో అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
పోలీస్ కానిస్టేబుల్, ఫైర్‌మెన్, జైలు వార్డర్ తదితర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే అప్లై చేయాలి. ఇందుకోసం TGPRB అధికారిక పోర్టల్‌ను సందర్శించి, ముందుగా అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అనంతరం విద్యార్హతలకు సంబంధించిన వివరాలు, ఫొటో, సంతకం వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అన్ని వివరాలను ఒకసారి పరిశీలించిన తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.

