Mounika Murder case updates: విశాఖ జిల్లా గాజువాకలో మౌనిక అనే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా మొదలైన పరిచయం, చివరకు అత్యంత క్రూరమైన హత్యకు దారితీసింది.
నేవీలో పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి, తన మాజీ ప్రియురాలు మౌనికను పక్కా ప్రణాళికతో అంతమొందించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు, తన సర్వీస్ ఐడీ కార్డును ఆమె తీసుకోవడంతో తన ఉద్యోగానికి ముప్పు వాటిల్లుతుందని భావించి రవీంద్ర ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆన్‌లైన్‌లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ముందుగానే ఆర్డర్ చేసి, మౌనికను ఇంటికి పిలిపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Read Also :lover murder AP : ప్రియురాలిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు
Ravindra Chops Girlfriend into Pieces in Gajuwaka… Here Is the Real Reason!
Mounika Murder case updates: భార్య లేని సమయంలో ఇంటికి పిలిచి హత్య
పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర Indian Navyలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇటీవలే అతనికి వివాహం కాగా అతని భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో రవీంద్ర గతంలో పరిచయం ఉన్న మౌనిక అనే యువతిని ఆదివారం తన ఫ్లాట్‌కు పిలిచాడు. అక్కడ జరిగిన గొడవలో ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం ఆధారాలు దాచిపెట్టేందుకు మౌనిక శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్లు వెల్లడైంది.
స్నేహితుడికి చెప్పడంతో బయటపడిన హత్య
మౌనికను హత్య చేసిన తర్వాత రవీంద్ర తన స్నేహితుడికి ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో విషయం బయటకు రావడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో రెండు మూటల్లో మౌనిక శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం పంపించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు.
మూడు సంవత్సరాల పరిచయం
రవీంద్రకు మౌనికతో దాదాపు మూడు సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతను మరో యువతిని వివాహం చేసుకోవడంతో మౌనిక అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అలాగే ఆర్థికంగా సహాయం చేయాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మౌనికను అడ్డుగా భావించిన రవీంద్ర ముందుగానే పథకం వేసి ఆమెను తన ఫ్లాట్‌కు పిలిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కిరాతకం: గొంతు నులిమి చంపి.. శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి!
పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. మౌనికతో వాగ్వాదం జరిగిన సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేసిన రవీంద్ర, ఆపై ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికాడు. కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో దాచి, మరికొన్నింటిని బాక్సుల్లో ఉంచాడు. తల, చేతులు వంటి భాగాలను అడవివరం ప్రాంతానికి తీసుకెళ్లి తగులబెట్టాడు. అయితే, జరిగిన విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో, అతడు రవీంద్ర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడు.
నిందితుడికి రిమాండ్.. కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు
నిందితుడు రవీంద్రను సోమవారం రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు ఏప్రిల్ 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ప్రాథమిక విచారణలో నిందితుడు అన్ని విషయాలను వెల్లడించకపోవడంతో, మరిన్ని ఆధారాల కోసం పోలీసులు అతడిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకువచ్చిన సమయంలో మౌనిక బంధువులు ఆగ్రహంతో పోలీసు వాహనాన్ని అడ్డుకుని రవీంద్రపై దాడికి ప్రయత్నించారు.
Mounika Murder case updates: న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆవేదన
తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని మౌనిక తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆయన కోరారు. ఈ కేసులో రవీంద్ర భార్య ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

