Lover murder AP : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా భయం, ఆందోళన నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భార్య లేని సమయంలో ఇంటికి పిలిచి హత్య
పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర Indian Navyలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇటీవలే అతనికి వివాహం కాగా అతని భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం.
ఈ సమయంలో రవీంద్ర గతంలో పరిచయం ఉన్న మౌనిక అనే యువతిని ఆదివారం తన ఫ్లాట్‌కు పిలిచాడు. అక్కడ జరిగిన గొడవలో ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం ఆధారాలు దాచిపెట్టేందుకు మౌనిక శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్లు వెల్లడైంది.
స్నేహితుడికి చెప్పడంతో బయటపడిన హత్య
మౌనికను హత్య చేసిన తర్వాత రవీంద్ర తన స్నేహితుడికి ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో విషయం బయటకు రావడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రవీంద్ర ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో రెండు మూటల్లో మౌనిక శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం పంపించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు.
తల, కాళ్లు దహనం చేసినట్లు అనుమానం
పోలీసుల ప్రాథమిక విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. మౌనిక తల, కాళ్లు కనిపించకపోవడంతో పోలీసులు ఆరా తీశారు. ఈ సందర్భంగా నిందితుడు ఆమె తల, కాళ్లు, చెప్పులు, సిమ్ కార్డు వంటి వాటిని సూట్‌కేసులో పెట్టి దారపాలెం ప్రాంతంలో దహనం చేసినట్లు సమాచారం.
ఈ హత్య ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
మూడు సంవత్సరాల పరిచయం
రవీంద్రకు మౌనికతో దాదాపు మూడు సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతను మరో యువతిని వివాహం చేసుకోవడంతో మౌనిక అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అలాగే ఆర్థికంగా సహాయం చేయాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో మౌనికను అడ్డుగా భావించిన రవీంద్ర ముందుగానే పథకం వేసి ఆమెను తన ఫ్లాట్‌కు పిలిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read Also: Amilineni Surendra Babu: కళ్యాణదుర్గంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
lover murder APRead hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

