Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిద్రపోతున్న పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు..12 మంది మృతి!

నిద్రపోతున్న పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు..12 మంది మృతి!

వార్త 4 days ago

Johannesburg Cleveland Crime: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ (Johannesburg) నగరంలో జూన్ 9, 2026 (మంగళవారం) అర్ధరాత్రి వేళ అత్యంత భయానక సామూహిక కాల్పుల ఘటన (Mass Shooting) చోటుచేసుకుంది.

ఈ విచక్షణారహిత కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోహన్నెస్‌బర్గ్ తూర్పు ప్రాంతంలోని క్లీవ్‌ల్యాండ్ సబర్బ్ పరిధిలో ఉన్న జంపర్స్ ఇన్‌ఫార్మల్ సెటిల్‌మెంట్ (Jumpers Informal Settlement) లో మంగళవారం రాత్రి సరిగ్గా 11:10 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఒక తెల్లటి టొయోటా క్వాంటం (Toyota Quantum) మినిబస్‌లో వచ్చిన 10 మందికి పైగా సాయుధ దుండగులు స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం దిగారు. ఆ సెటిల్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ఉన్న రెండు వేర్వేరు మార్గాల (Access Points) గుండా దుండగులు లోపలికి చొచ్చుకెళ్లారు. అనంతరం వేర్వేరు లొకేషన్లలో ఉన్న స్థానికులపై ఏకధాటిగా తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. అర్ధరాత్రి సమయం కావడంతో చాలా మంది గాఢనిద్రలో ఉండగా ఈ దాడి జరిగింది. కాల్పుల అనంతరం దుండగులు మళ్లీ అదే వాహనంలో అక్కడి నుండి వేగంగా పారిపోయారు.

మృతుల వివరాలు - పోలీస్ గాలింపు చర్యలు

 12 Killed, 9 Wounded in Late-Night Mass Shooting in Johannesburg

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు బుల్లెట్ గాయాలతో చెల్లాచెదురుగా పడి ఉన్న బాధితులు కనిపించారు. కాల్పుల తీవ్రతకు ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 12 (9 మంది పురుషులు, 3 గురు మహిళలు) కి చేరింది. గాయపడిన 9 మందికి ప్రస్తుతం అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం దక్షిణాఫ్రికా పోలీసులు భారీ ఎత్తున ‘మ్యాన్‌హంట్’ (గాలింపు చర్యలు) ప్రారంభించారు.

Johannesburg Cleveland Crime: దాడుల వెనుక ఉగ్రవాదమా? లేక గ్యాంగ్ వార్లా?

ఈ ఘోరకల్పనకు గల ఖచ్చితమైన కారణాలు (Motive) ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు తెలిపారు. అయితే స్థానిక నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా సాగుతున్న అక్రమ మైనింగ్ ముఠాల (Illegal Mining Gangs) మధ్య ఆధిపత్య పోరు లేదా స్థానిక గ్యాంగ్ వార్లే ఈ ఘోరానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక క్రైమ్ రేట్ (రోజుకు సగటున 60 హత్యలు) నమోదయ్యే దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి కావడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

లండన్‌లో భవనం పైనుంచి పడి భారతీయ కుటుంబం మృతి.. ఆత్మహత్యా? హత్యా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha