London Crime: భవిష్యత్తుపై ఎన్నెన్నో కలలు కంటూ లండన్ వెళ్లిన ఓ భారత సంతతి కుటుంబం అక్కడే విషాదాంతంగా ప్రాణాలు కోల్పోయింది. తమ తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి హాయిగా జీవిస్తున్న దంపతులు, అనుకోకుండా తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ మీద నుంచి పడి మరణించారు.
దక్షిణ లండన్‌లోని ఎలిఫెంట్ అండ్ క్యాజిల్ పరిధిలోని చర్చియార్డ్ రోలో ఉన్న 'హైపాయింట్' అనే 45 అంతస్తుల విలాసవంతమైన అపార్ట్‌మెంట్ టవర్‌లోని 36వ అంతస్తులో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. మే 27వ తేదీ ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో వీరు ముగ్గురూ 36వ అంతస్తు నుంచి కింద పడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు గమనించి వెంటనే అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించారు.
Read Also : Khammam Crime:మైనర్ బాలికపై అఘాయిత్యం.. బిల్డింగ్ పైనుంచి తోసేసిన దుర్మార్గుడు!
Indian family dies after falling from a building in London… Suicide or murder?
London Crime: ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్
సమాచారం అందుకున్న వెంటనే మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులతో పాటు లండన్ అంబులెన్స్ సర్వీస్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆ ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరణించిన వారిని భారత సంతతికి చెందిన రాకేష్ నారాయణ్ పాయ్ (47), అదితి విజయ్ పారాల్కర్ (46), వారి తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ పాయ్ పారాల్కర్‌గా గుర్తించారు. ప్రస్తుతం వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అనారోగ్య సమస్యలు.. విపరీతమైన మానసిక ఒత్తిడి
లండన్‌కు వలస వచ్చిన ఈ దంపతులు, అక్కడే సొంతంగా ఒక కన్సల్టెన్సీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే తొమ్మిదేళ్ల క్రితమే వీరికి కుమారుడు సిద్ పుట్టాడు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. బాబు సిద్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతనికి మాటలు రాకపోవడంతో పాటు తీవ్రమైన లెర్నింగ్ డిసేబిలిటీస్, పాక్షిక అంగవైకల్యం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. బాబు పరిస్థితి కారణంగా ఆ దంపతులు ఇద్దరూ విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తల్లి అదితి ఈ ఒత్తిడిని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్‌తో పోరాడుతోందని ఆమె స్నేహితులు తెలిపారు.
దర్యాప్తు వేగవంతం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు
బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం.. రాకేష్‌యే తన భార్య, కుమారుడిని చంపేసి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే రాకేష్ ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండేవాడని, ఈ ఘటన తమకు నమ్మశక్యంగా లేదని వారి స్నేహితులు చెబుతున్నారు. ఈ మరణాల వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం స్పష్టం చేసింది.
యాక్టింగ్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ డాన్ విట్టెన్ మాట్లాడుతూ.. “ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు, సానుభూతి అదితి, రాకేష్, సిద్ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాయి. ఈ విషాద మరణాలకు గల కారణాలను క్షుణ్ణంగా అన్వేషిస్తున్నాము. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున, ప్రసార మాధ్యమాలు గానీ, సాధారణ ప్రజలు గానీ ఎలాంటి అంచనాలకు లేదా ఊహాగానాలకు తావివ్వకూడదు” అని కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

