Jangaon Snake Bite Incident: జనగామ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే రాత్రి రెండు వేర్వేరు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు.
దేవరుప్పుల మండలం ముండిచింతతండాకు చెందిన శ్రీయాన్ అనే నాలుగేళ్ల బాలుడు శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఊహించని విధంగా రెండు విష సర్పాలు బాలుడిపై దాడి చేశాయి. మొదట నాగుపాము, ఆ తర్వాత కొద్దిసేపటికే రక్తపింజరి బాలుడిని కాటేయడంతో విషం వేగంగా శరీరమంతా పాకింది.
Read Also : Mahabubabad Crime: ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య!
A four-year-old boy died after being bitten by two snakes.
Jangaon Snake Bite Incident: ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం
బాలుడి అరుపులు విని నిద్రలేచిన తల్లిదండ్రులు, పాము కాటుకు గురైనట్లు గుర్తించి హుటాహుటిన హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడిని బ్రతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించడంతో చికిత్స పొందుతూ శ్రీయాన్ కన్నుమూశాడు. రెండు బలమైన విష సర్పాలు కాటు వేయడంతో బాలుడి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. కళ్లముందే అల్లారుముద్దుగా పెరుగుతున్న చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ముండిచింతతండాలో విషాద వాతావరణం నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

