Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల పరిధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. వరుసకు తల్లిలాంటి అత్తపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కట్టుకున్న భార్యను గదిలో బంధించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also:Terror Attack Plot: చారిత్రాత్మక దేవాలయాలపై పాక్ ఉగ్రదాడులకు కుట్రలు
Sangareddy Crime: అసలేం జరిగిందంటే.. గొడవ సర్దుబాటు చేద్దామని వస్తే!
పోలీసుల వివరాల ప్రకారం.. వట్ పల్లి మండలానికి చెందిన నిందితుడు గత కొంతకాలంగా మద్యం మత్తులో భార్యతో గొడవ పడుతున్నాడు. భర్త వేధింపుల గురించి భార్య తన తల్లికి మొరపెట్టుకుంది. కూతురి కాపురాన్ని చక్కదిద్దాలనే ఉద్దేశంతో అత్త వేరే ఊరి నుంచి అల్లుడి ఇంటికి చేరుకుంది. శుక్రవారం రాత్రి నిందితుడు తాగి రావడమే కాకుండా, మటన్ వండలేదనే సాకుతో భార్యతో గొడవకు దిగాడు.
Sangareddy District Crime
మృగంలా మారి భార్యను బంధించి..
అల్లుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన అత్తపై నిందితుడు బూతులు తిడుతూ విరుచుకుపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. భార్యను ఒక గదిలోకి నెట్టి బయట నుంచి గడియ పెట్టాడు. ఆ తర్వాత అత్తను మరో గదిలోకి బలవంతంగా లాక్కెళ్లి, తలుపులు మూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల రంగప్రవేశం.. నిందితుడు అరెస్ట్
బాధిత మహిళ జరిగిన విషయాన్ని కూతురికి చెప్పి, వట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
కేసు దర్యాప్తు ముమ్మరం
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. మద్యపానానికి బానిసై ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

