పాట్నాలో దారుణ ఘటన
Patna child crime : బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన 22 ఏళ్ల యువకుడు తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
బాలికను ఆస్పత్రికి తరలింపు
తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
Read Also:SRH vs LSG match updates: షమీ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుట్!
Patna child crimeఇద్దరు అరెస్ట్.. మరొకరి కోసం గాలింపు
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మేనమామతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

