Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిద్రిస్తున్న తల్లిని నిప్పు పెట్టి హతమార్చిన కిరాతక కుమారుడు

నిద్రిస్తున్న తల్లిని నిప్పు పెట్టి హతమార్చిన కిరాతక కుమారుడు

వార్త 2 months ago

Ongole crime: ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్నతల్లిని ఓ కుమారుడు ఇంట్లోనే నిప్పుపెట్టి హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Thane Road Accident: రైతా వంతెనపై వ్యాన్-సిమెంట్ మిక్సర్ ఢీ, 11 మంది మృతి

 Ongole crime: Cruel son sets sleeping mother on fire to death

ఘటన వివరాలు

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం వెంకట రమణమ్మ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె పెద్ద కుమారుడు కిషోర్ బాబు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె పడుకుని ఉండగానే నిప్పు పెట్టడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఇంట్లో నుంచి మంటలు చెలరేగడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అయితే, అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే వెంకట రమణమ్మ మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఘటన జరిగిన వెంటనే నిందితుడు కిషోర్ బావు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడికి కొంతకాలంగా మానసిక సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్సై గోవింద్ నాయక్ మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha