Dailyhunt
నికోలస్ పూరన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్నో ఫ్యాన్స్

నికోలస్ పూరన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్నో ఫ్యాన్స్

వార్త 1 week ago

పీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ గతేడాది ప్రదర్శనలో కనీసం సగం కూడా కనబరచలేకపోవడమే.

వేలంలో భారీ ధర పలికిన ఈ వెస్టిండీస్ పవర్‌హౌస్, ఈ సీజన్‌లో బ్యాట్ ఝుళిపించలేక చతికిలపడటం లక్నో మేనేజ్‌మెంట్‌ను కూడా ఆందోళనలో పడేస్తోంది.

Read Also : AP pensions : ఏపీలో కొత్త పింఛన్లు.. మొదట ఎవరికో తెలుసా?

రూ.21 కోట్లకు తగ్గని ఆట.. అంకెల్లో దారుణ వైఫల్యం

లక్నో జట్టు నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ.21 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. అతను క్రీజులోకి వస్తే సిక్సర్ల వర్షం కురుస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో పూరన్ కేవలం 73 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. అతని ఇన్నింగ్స్ వివరాలు చూస్తే.. RRపై 22, PBKSపై 9, RCBపై 1, GTపై 19, KKRపై 13, SRHపై 1, DCపై 8 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క అర్థ సెంచరీ కూడా లేకపోవడం పూరన్ ఫామ్‌లేమికి అద్దం పడుతోంది.

పాత పూరన్ ఎక్కడ? స్ట్రైక్ రేట్ మరీ దారుణం

2025 సీజన్‌లో పూరన్ ఒక భీభత్సమైన ఆటగాడిగా కనిపించాడు. ఆ ఏడాది 196 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 524 పరుగులు సాధించి, లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 40 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన పూరన్, ఈ ఏడాది మాత్రం కేవలం 3 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, అతని ప్రస్తుత స్ట్రైక్ రేట్ కేవలం 82. టీ20 ఫార్మాట్‌లో ఒక హిట్టర్‌కు ఇది అత్యంత చెత్త రికార్డుగా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

లక్నో ప్లేఆఫ్ ఆశలపై దెబ్బ.. ఫ్యాన్స్ ఆగ్రహం

మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకగా ఉండాల్సిన పూరన్ వరుసగా విఫలమవుతుండటంతో లక్నో సూపర్ జెయింట్స్ స్కోరు బోర్డుపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ హిట్టింగ్ చేయాల్సిన సమయంలో పూరన్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడం వల్ల జట్టుకు విజయాలు దూరమవుతున్నాయి. “కోట్లు కుమ్మరించి కొంటే, ఈ ప్రదర్శన ఏంటి?” అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా పూరన్ తన పాత ఫామ్‌ను పుంజుకుని జట్టును ప్లేఆఫ్స్‌కు చేరుస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పోలింగ్ స్టార్ట్.. మోడీ ప్రత్యేక పిలుపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha