Ram Mohan Naidu: మే 11 : పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి నలబై లక్షల రూపాయాల నిధులు మంజూరు కావడం శుభపరిణామం అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల కావడంతో దేవాదాయ శాఖామంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులకు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ నుండి 40 లక్షలు, మ్యాచింగ్ కంట్రీబ్యుషన్ క్రింద మరో పది లక్షలు కలిపి మొత్తంగా 50 లక్షల రూపాయల నిధులతో ఆలయం చుట్టూ అందమైన కాంపౌండ్ వాల్, పండగల సమయంలో అవసరానికి సరిపడా షెడ్డుల నిర్మాణం చేపట్టనున్నారని అన్నారు.
Read Also : తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అతిథుల జాబితాలో ప్రముఖులు!
కూటమి సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) అన్నారు. ఉత్తరాంధ్రకు, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు నాయుడు.. అన్ని ప్రాంతాలకు సమాన వృద్ది సాధించేలా తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. పాతపట్నం ఆలయ అభివృద్ధికి, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తో కలసి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తాజాగా మంజూరు అయిన నిధుల విషయంలో మామిడి గోవిందరావు చాలా కృషి చేశారని కితాబిచ్చారు. ఆలయ ప్రాముఖ్యతకు ప్రాధాన్యత ఇస్తూ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావడం, మరోవైపు ఆలయానికి ఎదురుగా ఫ్లై ఓవర్ నిర్మాణంలో సైతం ఉత్సవాలకు వీలుగా డిజైన్ మార్పులు జరగడం తమ ప్రభుత్వ నిబద్దతను తెలుపుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. భవిష్యత్ లో అన్ని రకాలుగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అయిన నీలమణి దుర్గ అమ్మవారి వైభవాన్ని మరింత వ్యాప్తి చేస్తామని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

