ASHA Hospitals Protest: రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచా యి. నెట్వర్క్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభు త్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) వరుసగా రెండవ రోజు నిలిపివేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఆగిపోయాయి. దీంతో వైద్యం అందకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: MLA Bandaru Sravani: వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ
ASHA Hospitals Protest: NTR’s medical services stopped… the reason is accumulated dues
ASHA Hospitals Protest: విఫలమైన ప్రభుత్వ చర్చలు
ఆస్పత్రులు సేవలను కొనసాగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం ఆషా నాయకులతో చర్చలు జరిపింది. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆధ్వర్యాన ఎని ఆర్ వైద్య సేవ కార్యాలయంలో ఈ చర్చ లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఆషా మధ్య సమన్వయం రాకపోవడంతో చర్చ లు విఫలమయ్యాయి. తమకు మొత్తం రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఆషా నాయకులు సమావేశంలో వెల్లడించారు. డిసెంటరు నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం గతేడాది హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు.
ఆస్పత్రుల యాజమాన్యాల డిమాండ్లు
ఈ బకాయిలకు తోడు మూడు నెలల నుంచి మరింత పెరిగాయని, దీంతో ఆస్పత్రుల మనుగడే కష్టంగా మారిందని వివరించారు. ఒక పక్క బకాయిలు చెల్లించకుండా, మరోపక్క యూనివర్సల్ హెల్త్ స్కీం అంటూ పదేపదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, ఇది సరైన విధానం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత పథకంలోని బకాయిలు చెల్లించకుండా కొత్త పథకాన్ని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. పేరుకుపోయిన బకాయిల్లో తొలుత రూ.1000 కోట్ల వరకు చెల్లిస్తామని కార్యదర్శి సౌరబ్ గౌర్ అసోసియేషన్ నాయకులతో చెప్పినట్లు తెలిసింది. మరో మూడు నెలల్లో మరో రూ.1000 కోట్లు విడుదల చేస్తామని అన్నట్లు సమాచారం.
భవిష్యత్ కార్యాచరణ
అయితే ఆషా నాయకులు.. ప్రభుత్వ ప్రతిపాదలను తిరస్కరించారు. గతంలో జరిగిన చర్చల సందర్భంలో కూడా ప్రభుత్వం ఇలానే మాట ఇచ్చిందని నాయకులు పేర్కొన్నారు. తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తొలుత విడుదల చేస్తామన్న రూ.1000 కోట్లు జమయ్యే వరకు సేవలను నిలిపివేస్తామని చెప్పారు. మిగిలిన బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న హెల్త్ యూనివర్సిల్ పాలసీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దీనిని మూడు నెలలపాటు నిలిపివేసింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలపై ఆషా కార్యవర్గం విడిగా సమావేశమైంది. ప్రభుత్వం ప్రతిపాదనలు ఇతర అంశాలపై చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

