Telangana Doctors Strike: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో శుక్రవారం ఉదయం నుంచి అవుట్‌పేషెంట్ (OP) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.
38 (G.O. 38) నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGGDA) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నిరసన ప్రభావంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
While OP services have been halted at Gandhi and Osmania hospitals, emergency services continue to operate.
ఆస్పత్రుల్లో నిరసనల సెగ
హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఉదయం నుంచే వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించారు. ఓపీ సేవలు నిలిచిపోయినప్పటికీ, ఆస్పత్రులకు వచ్చే అత్యవసర (Emergency) కేసులు, ఐసీయూ మరియు ఇన్‌పేషెంట్ (IP) సేవలను రోగుల ప్రాణాల దృష్ట్యా యథావిధిగా కొనసాగిస్తున్నట్లు సంఘం నేతలు స్పష్టం చేశారు.
వైద్యుల అసంతృప్తికి ప్రధాన కారణాలు
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 38 ప్రకారం బదిలీలు జరపకపోవడంపై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వారి ప్రధాన ఆరోపణలు ఇవే. స్పౌజ్ కోటా (ఉద్యోగస్థులైన భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా చూసే నిబంధన) కింద దరఖాస్తు చేసుకున్న వారికి, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బదిలీల్లో ప్రాధాన్యత కోరుతున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తూ.. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల బదిలీలు కోరుకుంటున్న వైద్యుల విజ్ఞప్తులను అధికారులు పూర్తిగా పక్కనబెట్టారు.సంఘం గుర్తింపు పొందిన అధికారిక వైద్య సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలనే కనీస నిబంధనను కూడా అధికారులు అమలు చేయడం లేదని డాక్టర్లు మండిపడుతున్నారు.
Telangana Doctors Strike: అసలు జీవో 38 (G.O. 38) లో ఏముంది?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో జీవో 38ని జారీ చేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులందరి బదిలీలకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను (Guidelines) పొందుపరిచారు. బదిలీల్లో రాజకీయ లేదా ఇతర బాహ్య ఒత్తిళ్లకు తావులేకుండా.. నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా బదిలీలు చేపట్టాలి. ఇందులో ఉద్యోగుల సీనియారిటీ, తప్పనిసరి బదిలీ కాలపరిమితి, స్పౌజ్ క్రైటేరియా వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలను తుంగలో తొక్కి బదిలీల ప్రక్రియ సాగుతోందని టీజీజీడీఏ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 38ని సక్రమంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్

