Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్

వార్త 2 months ago

World Environment Day 2026: కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్.

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు ,జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి రష్మీ పెరుమాళ్,అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్ , డిఎఫ్ఓ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధరిపల్లి చంద్రం, వివిధ విభాగాల అధికారులు.. పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్టు విలువ తెలుసా అనే పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతిజ్ఞ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్మం త్రి పొన్నం ప్రభాకర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం లాంచనంగా ప్రారంభించాం.. ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటాలి మొక్కలు నాటడం కార్యక్రమంగా కాదు మన జీవితంలో భాగస్వామ్యం కావాలి హుస్నాబాద్ నియోజకవర్గం లో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులు గవర్నర్ గారి చేత మీద స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశాం 500 హోటల్స్ కి గ్లాస్ లు పంపిణీ చేశాం.. ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ ,సూర్యాపేట తో కలిసి అవార్డు తీసుకుంటుంది..

Read also:Ebola: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

World Environment Day 2026: గ్రామాల్లో పెరగాల్సిన పచ్చదనం

దిల్లీలో కాలుష్యంతో నివసించే పరిస్థితి లేదు.. తెలంగాణ లో అలాంటి పరిస్తితి రాకుండా ముఖ్యమంత్రి గారు ఈవి పాలసీ తీసుకొచ్చారు.. దేశంలో ఎక్కడ లేని విధంగా సున్నా టాక్స్ అమలు చేస్తున్నాం.. మొక్కలు నాటడానికి అన్ని గ్రామాల్లో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశాం.. ప్రజలందరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి.. ఒకప్పుడు ఎక్కడ చూసినా పండ్ల మొక్కలు ఉండేవి..ఇప్పుడు లేకపోవడం వల్ల కోతులు గ్రామాల్లోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయి.. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం..ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి.. ఎక్కడ ప్రభుత్వం స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలి.. ప్రభుత్వం గీతా కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాలు ఇచ్చేటప్పుడు తాటి చెట్లు ఈత చెట్లు నాటిస్తోంది గత సంవత్సరం అటెండర్ నుండి మొదలు జిల్లా కలెక్టర్ వరకు ఒకే రోజు మొక్కలు నాటారు.. అలాంటి కార్యక్రమం తీసుకోవాలి.. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రకృతి రక్షించడానికి మనం పని చేయాలి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేయడం కాదు పాటించాలి.. గ్రామాల్లో మొక్కలు నాటడం లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయండి.. మంచిగా మొక్కలు నాటిన గ్రామాల్లో సర్పంచ్ లను అభినందించండి..

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఫార్మాసిటీ కోసం మరో 283 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha