Dailyhunt
నిమ్స్ ఆధునిక కేన్సర్ చికిత్స యంత్రం ప్రారంభం

నిమ్స్ ఆధునిక కేన్సర్ చికిత్స యంత్రం ప్రారంభం

వార్త 1 week ago

Cancer Treatment: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిమ్స్ రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ఆధునిక అడ్వాన్స్డ్ హై ఎనర్జీ 'లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మహిళ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని సైతం ఇక్కడ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనీల్కుమార్యాదవ్, నిమ్స్ డైరెక్టర్ డా. ఎన్. బీరప్ప, పాల్గొన్నారు.

Read Also: Ibrahimpatnam MPDO Office: ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడులు

 State of the art cancer treatment machine launched at NIMS

Cancer Treatment: ముందస్తు పరీక్షలతో కేన్సర్ నివారణ

మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ మహిళలు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. ఈ యంత్రం ద్వారా ఆధునిక క్యాన్సర్ చికిత్స సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. ఈ శిబిరంలో 30 మంది మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు. వారికి బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ గర్భద్వార క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

నిమ్స్ లోని రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, గైనకాలజీ, రేడియాలజీ విభాగాల నిపుణులు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా ఒక మహిళ తనకు ఎదురైన ఇబ్బందిని నేరుగా మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి తన ఫోన్ నంబరును ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్న తనను సంప్రదించాలని సూచించారు. రోగుల వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆసుపత్రి వర్గాలకు ఆయన సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha