Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిమ్స్‌లో ఉచిత ఓపీ సేవలు యథాతథం.. మంత్రి ఆదేశాలు

నిమ్స్‌లో ఉచిత ఓపీ సేవలు యథాతథం.. మంత్రి ఆదేశాలు

వార్త 2 weeks ago

NIMS Hyderabad: ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద నిమ్స్ ఆసుపత్రిలో అవుట్‌ పేషెంట్ (OP) సేవలను ఉచితంగానే అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌కు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. నూతన నిబంధనలతో సంబంధం లేకుండా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also : Telangana New Pensions: సర్టిఫికెట్లు లేకున్నా పింఛన్‌కు అప్లై చేసుకోవచ్చు

 Free OP services at NIMS to continue as usual: Minister's orders.

NIMS Hyderabad: ఈహెచ్‌ఎస్ కొత్త గైడ్‌లైన్స్, నిమ్స్ మినహాయింపు

సాధారణంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఈహెచ్‌ఎస్ పేషెంట్లకు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఇన్‌పేషెంట్ (IP) సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే అవుట్‌పేషెంట్ (OP) సేవలు అందించాల్సి ఉంది. కానీ నిమ్స్ ఆసుపత్రి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, అక్కడ కూడా అవుట్‌పేషెంట్ సేవలను గతంలో మాదిరిగానే పూర్తి ఉచితంగా కొనసాగించాలని మంత్రి అధికారులను పురమాయించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 12 వెల్‌నెస్ సెంటర్లు అందుబాటులో ఉండగా, ప్రభుత్వం కొత్తగా మరో 24 సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు వెల్‌నెస్ సెంటర్లు లేని అన్ని జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోనే అదనంగా మరో 3 వెల్‌నెస్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

జనరల్ హాస్పిటళ్లతో అనుసంధానం & సూపర్ స్పెషాలిటీ సేవలు

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులకు (General Hospitals) అనుసంధానిస్తూ వెల్‌నెస్ సెంటర్ల పరిధిని పెంచుతున్నారు. దీని ద్వారా వెల్‌నెస్ సెంటర్లలోనే స్పెషాలిటీతో పాటు అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా సాధారణ ప్రజలకు, ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha