Telangana Weather: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
రాష్ట్రంలోని దాదాపు 26 జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రానున్న 10 రోజుల పాటు అంటే ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also:Thaddanpally Toll Plaza Traffic Jam:తాడ్దాన్‌పల్లి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్
44 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నప్పటికీ, గాలిలో తేమ పెరగడం వల్ల ఉక్కపోత అధికంగా ఉంటుంది. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం అత్యధికంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Telangana Weather: ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు (Safety Tips)
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది.అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని తెలిపింది. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

