Thaddanpally Toll Plaza Traffic Jam:వాహనదారులకు తప్పని తిప్పలు సంగారెడ్డి జిల్లా. చౌటకూర్ మండలం తాడ్దాన్‌పల్లి గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పెళ్లిళ్ల సీజన్, వీకెండ్ కావడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన నాలుగు లైన్లు తెరువకపోండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర గంట పాటుఎండలో వాహనాలు రహదారిపై ఆన్ చేసి ఉంచడంతో డీజిల్, పెట్రోల్ అదనంగా ఖర్చు అవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also :Singur Project Water Release: సింగూర్ ప్రాజెక్టుకు దిగువకు నీటి విడుదల

Thaddanpally Toll Plaza Traffic Jam: టోల్ ప్లాజా వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం, అదనపు లైన్లు తెరవకపోవడం వల్లనే తరచుగా ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందంటున్నారు. దీంతో వాహనదారులు టోల్ ప్లాజా నిర్వాహకుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

