Telangana Heatwave:రాష్ట్రంలో ఎండలు మళ్ళీ ముదురుతున్నాయి. నేటి నుంచి భానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. మే 22 వరకు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం 44 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 48 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉంది. బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also: AP Weather: నాలుగు రోజులు వర్ష సూచన
Sun heatwave alert in Telangana 2026
Telangana Heatwave:పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జాగ్రత్త
మే నెలాఖరు వరకు ఎండల వేడి సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. నిప్పులు కురిపించే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి కానున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవడం చాలా మంచిది. వడదెబ్బ తగలకుండా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. వాతావరణంలో వచ్చే ఈ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.
త్వరలోనే చల్లని కబురు
తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. ఈ నెల 20 నాటికి అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఇవి మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ వేడి గాలులు, ఉక్కపోత తప్పకపోవచ్చు. వర్షాలు మొదలైతేనే మనకు ఈ ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

