Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

వార్త 1 week ago

AP Weather Update: నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడనుందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also:CM Vijay Team: విజయ్ టీమ్‌లో తెలుగు వ్యక్తులు

AP Weather Update: జిల్లాల వారీగా వర్ష సూచన

ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రెండుమూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది.

 Andhra Pradesh Weather Update

ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సింగపూర్‌లో మంత్రి లోకేష్.. స్టైలిష్ లుక్ వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha