Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిప్పుల కొలిమిలా తెలంగాణ.. వడదెబ్బతో నలుగురు మృతి

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. వడదెబ్బతో నలుగురు మృతి

వార్త 2 months ago

Telangana Sunstroke Deaths: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల మార్కును దాటేశాయి.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read also: VIP Security Reduction: ప్రముఖుల 'భద్రత' కుదింపు!

Heat wave in Telangana weather update

Telangana Sunstroke Deaths: వడదెబ్బతో విషాదం

తీవ్రమైన వడగాడ్పుల కారణంగా సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ బారిన పడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ సాయం బాధిత కుటుంబాలకు కొంత మేర భరోసానివ్వనుంది.

పరిహారం పొందే విధానం

ప్రభుత్వ పరిహారం పొందాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో మృతుని పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ (FIR) కాపీ, వాతావరణ శాఖ ధృవీకరణ పత్రం తప్పనిసరి. వీటితో పాటు డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మరియు కుటుంబ సభ్యుల డిక్లరేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేయాలి. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటేనే పరిహారం మంజూరవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha