త్వరలో రాష్ట్రస్థాయి సమీక్ష, విడతల వారీగా గన్మెన్ల తొలగింపు
VIP Security Reduction: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను కుదించాలని సర్కారు నిర్ణయించింది.
దీనిపై వారం రోజుల్లో రాష్ట్ర స్థాయిలో సమీక్ష తరువాత విడతల వారిగా గన్మెన్లను తొలగించాలని సర్కారు నిర్ణయిం చినట్లు తెలిసింది. కాగా నక్సల్స్ హిట్ లిస్టులో వున్న నేతలు, పోలీసు, మాజీ పోలీసు అధికారులకు మరికొంత కాలం భద్రతను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: University of London Hyderabad: హైదరాబాద్ లో లండన్ వర్సిటీ క్యాంపస్
The government is going to reduce the security of celebrities.
VIP Security Reduction: వివిధ హోదాల్లో భద్రత కల్పన
రాష్ట్రంలో మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలతో పాటు మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, నక్సల్స్ హిట్ లిస్టులో వున్న నేతలు, విశ్రాంత గవర్నర్లు, పోలీసు అధికారులు, ఇక్కడ వుంటూ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లు, ఇతర ఉన్నత హోదాలో వున్న వారికి సర్కారు చాలా కాలంగా భద్రత కల్పిస్తుండడం తెలిసిందే. ఇందులో కొందరికి జడ్ ప్లస్ కేటగిరి, మరికొందరికి జడ్ కేటగిరి, ఇంకొందరికి వై కేటగిరి ఇలా పలురకాల రక్షణను ప్రభుత్వ కల్పిస్తోంది.
దీని కింద కొందరికి పది మంది అంతకు మించి సాయుధ పోలీసులతో భద్రత వుండగా వీరికి ఎస్కార్టు వాహనాలు కూడా వుంటున్నాయి. ఇదే సమయంలో మరికొందరికి ఆరుగురి నుంచి నలుగురి వరకు గన్మెన్లు, ఇంకొందరికి ఇద్దరేసి గన్మెన్లు భద్రత గా వుంటున్నారు. వీరితో పాటు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా గన్మెన్ల సౌకర్యం వుంది. ఇందులో కొందరు పేమెంట్ ప్రాతిపదికన భద్రత పొందుతున్నారు. ప్రముఖుల భద్రత కోసం రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ పేరిట ప్రత్యేకంగా ఒక విభాగం వుండగా విఐపిల కోసం ఇంకో విభాగం వుంది. హైదరాబాద్లో సిటీ సెక్యూరిటీ వింగ్ పేరిట ఇంకో విభాగం వుంది. ప్రముఖుల భద్రతకు సాయుధ బలగాల నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లను వాడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
అనుమతులు లేకుండానే నిర్మాణాలు.. ఐలాపూర్ వివాదంపై హైడ్రా స్పష్టత

