Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరసనల నుంచి నిర్మాణాత్మక మార్పు వైపు..

నిరసనల నుంచి నిర్మాణాత్మక మార్పు వైపు..

వార్త 3 weeks ago

Protests : ప్రజాస్వామ్యంలో నిరసన అనేది బలహీనతకు కాదు, బలానికి చిహ్నం. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే అత్యంత శాంతియుతమైన ప్రజాస్వామ్య సాధనం అది.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి సంఘాలు, యువజన వర్గాలు, పౌరసంఘాలు పాల్గొన్న నిరసనలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే ఏ నిరసన గురించి మాట్లాడినా వాస్త వాలు, విమ ర్శలు, రాజకీయ ప్రయోజనాలు, దేశ ప్రయోజ నాలు ఈ నాలుగు కోణాల్లో సమగ్రంగా విశ్లేషించడం అవసరం. విద్యార్థి ఉద్యమాల చరిత్రను పరిశీలిస్తే, దేశ సామాజిక, రాజకీయ పరిణామాల్లో వాటి పాత్ర ఎంతో కీలకమైనది. అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలో లోపాలు, పరీక్షల పారదర్శకత, అవకాశాల్లో సమానత్వం వంటి అంశాలపై యువత స్వరం వినిపించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి సంకేతం. సమాజంలో కనిపిస్తున్న సమస్యలను ప్రశ్నించ దం, ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కు. అయితే ప్రతి ఉద్యమం వెనుక ఉన్న సదుద్దేశాన్ని గుర్తించడంతో పాటు, దాని అమలు విధానాన్ని కూడా పరిశీలించాలి.

 Protests

Protests : సంభాషణ ఎప్పుడూ ఘర్షణ కంటే శ్రేయస్కరం

నిరసనలు శాంతియుతంగా, చట్టబద్ధంగా సాగితే ప్రజల మద్దతు లభిస్తుంది. కానీ హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రజల సాధారణ జీవితానికి ఆటంకం కలిగితే అసలు లక్ష్యం మరుగున పడే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో విభేదాలను వ్యక్తపరిచే హక్కు ఉన్నట్లే, ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యత కూడా ప్రతి పౌరుడిపై ఉంది. ఇటీవలి ఆందోళనలపై వచ్చి న విమర్శల సారాంశం కూడా ఇదే. కొన్నివర్గాలు ఉద్యమా లను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాయనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు, ప్రభుత్వం ప్రజల ఆందోళనలను ప్రారంభ దశలోనే సానుకూలంగా స్వీకరిం చి, పారదర్శక సంభాషణకు అవకాశం కల్పించి ఉంటే ఉద్రిక్తతలు తగ్గేవని కూడా పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో సంభాషణ ఎప్పుడూ ఘర్షణ కంటే శ్రేయస్కరం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మరో అంశాన్ని కూడా విస్మరించరాదు. ప్రతి ప్రజా ఉద్యమంలో తమ స్వప్రయోజనాల కోసం చొరబడే అవకాశవాద శక్తులు ఉండే అవకాశం ఉంటుంది. హింసను ప్రోత్సహించడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, జాతీయ సమగ్రతను దె బ్బతీసే చర్యలకు పాల్పడటం వంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితు ల్లోనూ సహించరాదు. అయితే ఇటువంటి ఆరోపణలు ఎవరిపైనా ఆధారాలు లేకుండా చేయడం కూడా సమంజసం కాదు.

 Protests

ప్రజల విశ్వాసమే ఒక ఉద్యమానికి నిజమైన బలం

దేశ భద్రతను కాపాడటం ఎంతముఖ్యమో, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత, విద్యార్థి ఉద్యమాలకు కూడా కొన్ని ఆత్మపరిశీలనలు అవసరం. సమస్యలను మాత్రమే ప్రస్తా వించడం కాకుండా, వాటికి ఆచరణ సాధ్యమైన ప్రత్యా మ్నాయాలను కూడా ప్రతిపాదించాలి. విధానాలపై అధ్య యనం, గణాంకాలతో కూడిన చర్చ, నిపుణులతో సంభాషణ, చట్టబద్ధమైన నిరసన పద్ధతులు ఇవే ఉద్యమాలకు మరింత విశ్వసనీయతను తెస్తాయి. సోషల్ మీడియా ప్రచా రం కంటే ప్రజల విశ్వాసమే ఒక ఉద్యమానికి నిజమైన బలం. ప్రభుత్వం కూడా విమర్శలను శత్రుత్వంగా కాకుం డా ప్రజాభిప్రాయంగా స్వీకరించాలి. యువత ప్రశ్నలను వినాలి. నియామకాలలో పారదర్శకత, విద్యారంగ సంస్క రణలు, ఉపాధి అవకాశాల విస్తరణ, అవినీతిపై కఠిన చర్య లు వంటి అంశాల్లో వేగంగా స్పందిస్తే అసంతృప్తి తగ్గుతుం ది. సమర్ధవంతమైన పాలనకు ప్రజల విశ్వాసమే పునాది. దేశానికి ఈరోజు అవసరమైనది కేవలం ఉ ద్యమాల వరం పర కాదు. సమూల మార్పుకు దారితీసే నిర్మాణాత్మక దృక్పథం. దేశం ముందుకు సాగాలంటే యువత ప్రశ్నించాలి. ప్రభుత్వం వినాలి. సమాజం ఆలోచించాలి. ఆలోచనలతో గెలిచే ప్రజాస్వామ్యమే శాశ్వతమైనది, ఆవేశాలతో కాదు. |

-సురేష్ కాలేదు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha