Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన

వార్త 2 weeks ago

TG Police Recruitment Update : రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్​మెంట్ ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణ తేదీలను తెలంగాణ పోలీస్ నియామక మండలి ప్రకటించింది.

ఆగస్టు 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తులను అధికారిక వెబ్​సైట్​ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. ఎస్సై పోస్టులకు రూ.750 (ఎస్సీ/ ఎస్టీ), రూ.1,500 ఇతరులకు ఫీజు ఉంటుందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది. అప్లికేషన్​ ప్రొఫార్మాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు పోలీస్ ఉద్యోగాల నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస రావు ఇటీవలే వెల్లడించారు.

Read Also: CITU Protest Nellore: నెల్లూరులో సిఐటియు భారీ ధర్నా

 TG Police Recruitment

TG Police Recruitment Update : ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందే తెలంగాణ రాష్ట్రంలో స్థానికులైన అభ్యర్థులు కొన్ని సర్టిఫికెట్లను సమకూర్చుకోవాలని పోలీసు నియామక మండలి సూచించింది. బీసీ అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత తీసుకున్న నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్​ను సిద్ధం చేసుకోవాలి. అభ్యర్థులంతా 1 నుంచి ఏడో తరగతుల వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్లు లేదంటే రెసిడెన్సీ సర్టిఫికెట్ (రెండింటిలో ఏవి వర్తిస్తే అవి) రెడీగా ఉంచుకోవాలి. దివ్యాంగ, క్రీడా తదితర ప్రత్యేక కేటగిరీల కింద అర్హులైతే వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకోవాలి. ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్‌-1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా కుల ధ్రువపత్రం పొంది ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు తమ క్యాస్ట్ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తేదీ తర్వాత ప్రభుత్వం నుంచి పొందిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్​ను సిద్ధం చేసుకోవాలి.

Epaper: epaper.vaartha.com

నేటి నుంచే సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha