Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి

వార్త 1 week ago

Fee Reimbursement: తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మరియు దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల (స్కాలర్‌షిప్స్) పంపిణీ పద్ధతిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుండి ఈ నిధులను విద్యాసంస్థలకు కాకుండా, నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేయాలని ప్రభుత్వం గట్టి ప్రణాళికను సిద్ధం చేసింది.

 TG Scholarship Direct Benefit Transfer

Read also:CM Revanth Vs MP Arvind : MP అర్వింద్ కు సీఎం రేవంత్ కౌంటర్

నెల రోజుల్లోనే నిధుల విడుదల.. వారం రోజుల్లో కాలేజీకి కట్టాలి!

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల ఫీజుల రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందక అటు విద్యార్థులు, ఇటు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి, దరఖాస్తు అప్రూవ్ అయిన కేవలం నెల రోజుల్లోనే నిధులను అకౌంట్లలో జమ చేసేలా కొత్త వ్యవస్థను తెస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి తమ ఖాతాల్లో పడిన ఫీజు మొత్తాన్ని విద్యార్థులు వారం రోజుల్లోగా తమ కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కాలేజీకి ఫీజు కట్టకపోతే, ఆ సొమ్మును విద్యార్థి నుంచి తిరిగి వసూలు చేసేలా కఠిన నిబంధనను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.

Fee Reimbursement: నిబంధనలు ఇవే.. ఆధార్ లింక్, హాజరు తప్పనిసరి!

ఈ సరికొత్త విధానం ద్వారా లబ్ధి పొందాలంటే విద్యార్థుల అకడమిక్ సర్టిఫికేట్లలో ఉన్న పేరు, ఆధార్ కార్డులోని పేరు ఒకేలా ఉండటం ప్రాథమిక నియమం. దాంతో పాటు ఆధార్ కార్డు కచ్చితంగా బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. ఆధార్ వెరిఫికేషన్, కాలేజీ యాజమాన్యం డిజిటల్ సంతకం, జిల్లా సంక్షేమ అధికారి ఫైనల్ అప్రూవల్ పూర్తయ్యాకే డబ్బులు అకౌంట్‌లో పడతాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసేందుకు ఈ-పాస్ (e-PASS) పోర్టల్‌ను విద్యాశాఖ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నారు. అలాగే, విద్యార్థులకు కనీసం 70 శాతం కాలేజీ హాజరు ఉంటేనే ఈ స్కాలర్‌షిప్‌లు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బకాయిలు ఉండవు.. ప్రతి నెలా రూ.200 కోట్ల విడుదల

నిధుల కొరత కారణంగా ఏటా ఫీజులు పెండింగ్‌లో పడిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల చొప్పున బడ్జెట్ విడుదల చేయాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరం ముగిసేలోపే విద్యార్థులందరికీ పూర్తి నిధులు అందేలా కార్యాచరణను రూపొందించారు. సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల భేటీ అనంతరం ఈ నిబంధనల దస్త్రానికి సంబంధిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల తుది అనుమతి లభించిన వెంటనే దీనిపై అధికారిక జీవో (GO) విడుదల కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఉదండాపూర్ రిజర్వాయర్ పనులపై సీఎం రేవంత్ సమీక్ష!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha