Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు తెలంగాణ అవతరణ దినోత్సవ కానుక!

నిరుద్యోగులకు తెలంగాణ అవతరణ దినోత్సవ కానుక!

వార్త 1 week ago

TGPSSC AE Notification 2026: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSSC) బంపర్ బోనాంజా ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,800 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఈ నోటిఫికేషన్ల జారీకి కసరత్తు ముమ్మరం చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.

Read Also :JEE Advanced results Topper: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్

రాష్ట్ర అవతరణ కానుకగా.. నేడే 3 కీలక నోటిఫికేషన్లు

 Burra Venkatesham Declares 3,800 Govt Jobs; 3 Notifications Out Today

మంగళవారం (రాష్ట్ర అవతరణ దినోత్సవం) నాడు మూడు ప్రత్యేక కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

  • ఆర్ అండ్ బీ (R&B) శాఖ: 222 అసిస్టెంట్ ఇంజనీర్ - AE (సివిల్) పోస్టులు.
  • ఆర్ అండ్ బీ (R&B) శాఖ: 49 అసిస్టెంట్ ఇంజనీర్ - AE (ఎలక్ట్రికల్) పోస్టులు.
  • కాలుష్య నియంత్రణ మండలి (PCB): 9 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ పోస్టులు.

TGPSSC AE Notification 2026: క్లస్టర్ పద్ధతిలో గ్రూప్ నోటిఫికేషన్లు.. నెలాఖరుకు మరో 3

ప్రస్తుతం కమిషన్ వద్ద ఉన్న 3,800 ఉద్యోగాల అనుమతుల్లో కొన్ని శాఖల్లో ఒకటి రెండు పోస్టులే ఉన్నాయి. 28 శాఖల్లో 1 లేదా 2 ఉద్యోగాలు, మరో 20 శాఖల్లో 5 కంటే తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నవి కేవలం 11 శాఖలు మాత్రమే. ప్రతి పోస్టుకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తే అభ్యర్థులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి.. ఒకే విధమైన సబ్జెక్టు, అర్హతలు ఉన్న ఉద్యోగాలన్నింటినీ కలిపి ఒకే క్లస్టర్‌గా (రెండంకెల సంఖ్యలో) నోటిఫికేషన్లు ఇచ్చేలా కమిషన్ ఆలోచిస్తోంది. ఇదే క్రమంలో ఈ నెలాఖరులోగా మరో మూడు కీలక నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు:

అనుమతి లభించిన ఉద్యోగాల్లో అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) కేటగిరీలో 1,393 పోస్టులు ఉన్నాయి. వీటిని 'మల్టీ జోన్' వారీగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కమిషన్ యోచిస్తోంది.

ఇకపై అన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే (CBT)

టీజీపీఎస్సీ నిర్వహించే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక సంస్కరణలను ప్రకటించారు.అభ్యర్థుల సంఖ్య విపరీతంగా ఉన్నప్పుడు మాత్రమే పాత పద్ధతిలో (OMR Sheets) పరీక్షలు ఉంటాయి. మిగిలిన అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలోనే నిర్వహిస్తారు. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. పరీక్ష రాసిన వెంటనే అభ్యర్థి స్క్రీన్‌పై మార్కులు డిస్ప్లే అయ్యేలా కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. ప్రతి నెలా నోటిఫికేషన్ ఇచ్చి.. కేవలం 2 నుండి 3 నెలల్లోనే ఫలితాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. కొత్త నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు అభ్యర్థులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ను ఎడిట్ చేసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha