Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ అడ్మిట్ కార్డులు రేపు రిలీజ్..!

నీట్ అడ్మిట్ కార్డులు రేపు రిలీజ్..!

వార్త 3 weeks ago

NEET-PG Admit card : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహించే నీట్-పీజీ (NEET-PG Admit card) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల విడుదల మరో రోజుకు వాయిదా పడింది.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఇవాళే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక మరియుపాలనాపరమైన కారణాల వల్ల ఎన్బీఈఎంఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను రేపు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ క్రెడెన్షియల్స్ :

అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్‌పై ముద్రించిన ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం పేరు మరియు ఇతర వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.

తాజా షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 30న దేశవ్యాప్తంగా నీట్-పీజీ పరీక్ష జరగనుంది. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 1,300లకు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలోనే ఈ పరీక్ష కొనసాగనుంది. ఒకే షిఫ్టులో ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఈ పరీక్షా సరళి ప్రకారం అభ్యర్థులు మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటికి గాను మొత్తం 210 నిమిషాల సమయం కేటాయించారు. ప్రశ్నాపత్రాన్ని టైమ్-బౌండ్ సెక్షన్లుగా విభజించడం జరిగింది కాబట్టి, అభ్యర్థులు సమయాన్ని సరిగ్గా కేటాయించుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. చివరి నిమిషంలో జరిగే ట్రాఫిక్ లేదా ఇతర ఇబ్బందులను నివారించడానికి నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొండా సురేఖ అంశంపై ఎవరూ మాట్లాడొద్దు: సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha