NEET UG 2026 Leak: నీట్ యూజీ 2026 పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంలో పుణె నగరానికి చెందిన బ్యూటీషియన్ మనీషా వాఘ్మేర్ కీలకంగా మారారు. అందం పెంచే వృత్తిలో ఉంటూనే ఆమె తెరవెనుక అక్రమాలకు తెరలేపినట్లు సీబీఐ గుర్తించింది.
తన దగ్గరకు వచ్చే వారితో పరిచయాలు పెంచుకుని విద్యార్థులకు లీకైన ప్రశ్నపత్రాలను చేరవేసేందుకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది.
Read also: Shooting In Mexico: మెక్సికోలో ఓ సాయుధుడి కాల్పులు..10 మంది మృతి
Pune Beautician Manisha Waghmer Arrest
NEET UG 2026 Leak: టీచర్లతో కుమ్మక్కై భారీ కుట్ర
ఈ కుట్రలో కేవలం మనీషా మాత్రమే కాకుండా ఒక బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మందరే కూడా భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. వీరిద్దరూ కలిసి పరీక్షకు ముందే పేపర్ సంపాదించి విద్యార్థులకు అమ్మేందుకు ప్రణాళిక వేశారు. ప్రస్తుతం మనీషా వాఘ్మేర్ సీబీఐ కస్టడీలో ఉండగా ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారో అధికారులు ఆరా తీస్తున్నారు.
దర్యాప్తులో బయటపడుతున్న నిజాలు
పుణెలోని సుఖ్‌సాగర్ ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడిపే మనీషా తన పలుకుబడిని తప్పుడు పనులకు వాడుకుంది. టీచర్లకు, విద్యార్థులకు మధ్య వారధిలా మారి పరీక్షా వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. సీబీఐ లోతైన విచారణ జరుపుతుండటంతో రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com

