Supreme Court: మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష 'నీట్' (NEET-UG) పేపర్ లీకేజీ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నో కలలు, ఆశలతో కష్టపడి చదివి ఈ పరీక్ష రాసిన యువతను ఇలా నిరాశపరచడం తగదని కోర్టు పేర్కొంది.
NEET UG Paper Leak
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్‌టీఏ
మే నెలలో జరిగిన నీట్-యూజీ పరీక్షా పత్రాల లీకేజీ, అవకతవకల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టులో తాజాగా ఒక కీలక అఫిడవిట్‌ను సమర్పించింది. తమ పర్యవేక్షణలో జరిగే ప్రతీ పరీక్షను అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇందులో పేర్కొంది.
Read also: 112 helpline : దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్‌లైన్ నెంబర్.. సుప్రీం ఆదేశం
ఎగ్జామ్స్ లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్, లీకేజీలు జరగకుండా నిరోధించేందుకు కేంద్ర విద్యాశాఖతో కలిసి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు, పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను చాలా వరకు ఇప్పటికే ఆచరణలోకి తెచ్చామని కోర్టుకు వివరించింది.
Supreme Court: పరీక్షల భద్రత కోసం ఎన్‌టీఏ తెచ్చిన సరికొత్త సంస్కరణలు
భవిష్యత్తులో నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఎన్‌టీఏ అంతర్గతంగా పలు సంస్కరణలను అఫిడవిట్‌లో పొందుపరిచింది. సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు వీలుగా 16 కొత్త సీనియర్ అధికారుల పోస్టులను కేటాయించారు. టెక్నాలజీ ఆపరేషన్స్, టెస్ట్ సెక్యూరిటీని నిరంతరం పరిశీలించడం కోసం ఇద్దరు జాయింట్ సెక్రటరీల స్థాయి అధికారులను అడిషనల్ డైరెక్టర్స్ జనరల్‌గా నియమించారు. పరీక్షా కేంద్రాలన్నింటిలో సీసీటీవీలను ఏర్పాటు చేయడంతో పాటు, ఎగ్జామ్ ముగిసిన తర్వాత కూడా 90 రోజుల వరకు ఆ ఫుటేజీని సురక్షితంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.పరీక్షల సమర్థవంతమైన నిర్వహణ (Examination Management) కోసం ఐఐటీ, యూజీసీ, సీబీఎస్ఈ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణులను భాగస్వామ్యం చేశారు.
రాబోయే రోజుల్లో ‘నీట్’ను ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్) పద్ధతిలోనే ఉంచాలా? లేక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-ఆన్‌లైన్) మోడ్‌లోకి మార్చాలా? అనే కీలక అంశంపై ఉన్నత స్థాయి కమిటీ తుది కసరత్తు చేస్తోందని ఎన్‌టీఏ తెలిపింది. సంబంధిత మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం దీనిపై త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also:

