Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

వార్త 1 week ago

NEET-UG 2026: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 పరీక్ష రద్దు మరియు పేపర్ లీక్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.

Read Also : Karimnagar PMJ Robbery: కరీంనగర్ PMJ జ్యువెలరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

 Revanth Reddy’s response to the cancellation of NEET exam

NEET-UG 2026: వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోంది

పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస వైఫల్యాలు విద్యా వ్యవస్థపై విద్యార్థులకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దు నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఉదంతంపై కేంద్రం పారదర్శకమైన విచారణ జరిపి, అసలైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం

పోటీ పరీక్షలు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా ఉండాలి తప్ప, పేపర్ లీక్ మాఫియాకు అడ్డాగా ఉండకూడదని సీఎం హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం తక్షణమే పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో తెలంగాణలో జరిగిన పేపర్ లీక్ ఘటనలను గుర్తు చేస్తూ.. అప్పట్లో ఇక్కడ ఉన్న ప్రభుత్వ తీరు, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ తీరు ఒకేలా ఉన్నాయని ఆయన చురకలు అంటించారు.

విద్యార్థులు ఎవరూ అధైర్యపడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha