దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) పేపర్ లీక్ కుంభకోణంలో విచారణ జరుపుతున్న పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్‌లో మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఒక బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలి పాత్ర కీలకంగా ఉన్నట్లు తేలింది.
పుణెలోని బిబ్వేవాడి ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మనీషా వాఘ్మారే (46) అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ బ్యూటీ పార్లర్ లా కనిపించినప్పటికీ, దాని ముసుగులో పేపర్ లీక్ నెట్‌వర్క్, అడ్మిషన్ల దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Gold Robbery : వామ్మో..చూస్తుండగానే బంగారం కొట్టేసిన యువతి
NEET-UG 2026
NEET-UG 2026: వాట్సాప్ చాటింగ్‌తో బయటపడ్డ రహస్యాలు
అహల్యానగర్‌కు చెందిన మరో నిందితుడితో మనీషా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు లభించాయి. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ద్వారా కీలక సమాచారం లీక్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులకు లీక్ అయిన పేపర్లను చేరవేయడం, డీల్స్ కుదుర్చుకోవడంలో ఈమె మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మనీషా వాఘ్మారేను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వెనుక ఉన్న ఇతర పెద్దల గురించి ఆరా తీస్తున్నారు. కేవలం మహారాష్ట్రలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల నెట్‌వర్క్‌తో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

