Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి

వార్త 1 week ago

Gachibowli Lift Accident: హైదరాబాద్ ఐటీ హబ్ గచ్చిబౌలిలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. గౌలిదొడ్డిలోని ఒక ప్రైవేట్ మహిళా పీజీ (PG) హాస్టల్‌లో లిఫ్ట్ ప్రమాదానికి గురై ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.

మృతురాలిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తూ ఘోష్‌గా గుర్తించారు. ఆడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లేందుకు బాలిక లిఫ్ట్ ఎక్కగా, దురదృష్టవశాత్తూ ఆమె జుట్టు లిఫ్ట్ గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ కదులుతున్న సమయంలో ఒక్కసారిగా తల గ్రిల్‌కు, గోడకు మధ్య నలిగిపోవడంతో తల నుజ్జునుజ్జయి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

Read Also: Nellore Crime: అక్రమ సంబంధానికి అడ్డువస్తుందని అత్తను చంపిన కోడలు

 Five-year-old girl dies after getting stuck in elevator

Gachibowli Lift Accident: సహాయక చర్యలు.. మృతదేహం వెలికితీత

ప్రమాదం జరిగిన వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, హైడ్రా బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయిన బాలిక మృతదేహాన్ని గంటల తరబడి శ్రమించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

భద్రతా ప్రమాణాలపై విచారణ

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు చిన్నారి ఒక్కతే లిఫ్ట్ దగ్గరకు ఎలా వెళ్లింది? హాస్టల్ లిఫ్ట్‌కు సరైన భద్రతా గ్రిల్స్ లేదా సెన్సార్లు లేవా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రైవేట్ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్ పరారీ: హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు, విచారణకు గైర్హాజరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha