Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ రీ ఎగ్జామ్ పూర్తి.. ఇక రిజల్ట్స్‌పై అందరి దృష్టి

నీట్ రీ ఎగ్జామ్ పూర్తి.. ఇక రిజల్ట్స్‌పై అందరి దృష్టి

వార్త 1 week ago

NEET UG 2026 Re-exam: దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూసిన నీట్ యూజీ (NEET-UG 2026) పునఃపరీక్ష జూన్ 21 (ఆదివారం) విజయవంతంగా ముగిసింది.

మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించగా, దివ్యాంగులైన విద్యార్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు అదనపు సమయం కేటాయించారు. భారతదేశంలోని వివిధ నగరాలతో పాటు అంతర్జాతీయ కేంద్రమైన రియాద్‌లో కూడా ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది.

నిమిషం ఆలస్యం.. పరీక్ష కేంద్రాల వద్ద కన్నీళ్లు

ఎగ్జామ్ హాల్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ సమయం ముగియడంతో కొన్ని సెంటర్ల వద్ద తీవ్ర భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

NEET UG 2026 Re-exam: ఫిజిక్స్ టఫ్.. బయాలజీ ఈజీ: అభ్యర్థుల ఫీడ్‌బ్యాక్

పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. ఈసారి నీట్ ప్రశ్నపత్రం ఓవరాల్‌గా మధ్యస్థంగా (Moderate) ఉంది. సబ్జెక్టుల వారీగా చూస్తే ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) పేపర్ అన్నింటికంటే చాలా కఠినంగా రాగా, కెమిస్ట్రీ (రసాయనశాస్త్రం) కొద్దిగా ఇబ్బంది పెట్టింది. అయితే బయాలజీ (జీవశాస్త్రం) ప్రశ్నలు చాలా సులభంగా రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పరీక్ష ముగియడంతో ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు త్వరలోనే అన్‌అఫీషియల్ ఆన్సర్ కీలను విడుదల చేయనున్నాయి.

ఆన్సర్ కీ, ఫలితాల విడుదల తేదీలు ఇవే!

నేషనల్ Testing ఏజెన్సీ (NTA) అధికారిక ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 28 నాటికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు. జూలై చివరి నాటికి నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

పటిష్టమైన భద్రత మధ్య ఎగ్జామ్

గత మే నెలలో జరిగిన పరీక్షపై పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో కేంద్రం ఆ పరీక్షను రద్దు చేసి, ఈ రీ-ఎగ్జామ్‌ను పకడ్బందీగా నిర్వహించింది. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచారు. అభ్యర్థులు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha