Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వార్త 1 week ago

Bullet Train: భారతదేశంలో రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. దేశంలోని ప్రముఖ నగరాలను అనుసంధానిస్తూ కొత్తగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మెగా ప్రాజెక్టుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ హై-స్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

Read also: Narendra Modi: నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని ఎయిర్‌పోర్టులోనే గంటసేపు ఆగిన మోదీ

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట: రూట్లు ఇవే!

ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టుల ద్వారా తెలుగు రాష్ట్రాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల మధ్య ప్రయాణ సమయం గంటల్లోకి తగ్గిపోనుంది.

కేంద్రం ఖరారు చేసిన ప్రధాన రూట్లు, వాటి ప్రయాణ సమయాలు:

  • బెంగళూరు – హైదరాబాద్: కేవలం 2 గంటల 10 నిమిషాలు
  • పుణె – హైదరాబాద్: కేవలం 2 గంటల 08 నిమిషాలు
  • ముంబై – అహ్మదాబాద్: 1 గంట 57 నిమిషాలు
  • బెంగళూరు – చెన్నై: 73 నిమిషాలు
  • ముంబై – పుణె: 48 నిమిషాలు
  • ఢిల్లీ – లక్నో: 2 గంటలు
  • ఢిల్లీ – వారణాసి: 3 గంటల 15 నిమిషాలు
  • ఢిల్లీ – సిలిగురి: 6 గంటలు

ప్రస్తుతానికి ఈ కారిడార్లన్నీ ప్రతిపాదనల దశలో ఉన్నాయని.. క్షేత్రస్థాయి పరిశీలన, భూసేకరణ, నిధుల సమీకరణ మరియు అవసరమైన అనుమతులు పూర్తయిన తర్వాతే నిర్మాణ గడువును ప్రకటిస్తామని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

Bullet Train: వచ్చే ఏడాదికే తొలి బుల్లెట్ రైలు సర్వీస్!

జపాన్ సాంకేతికత మరియు ఆర్థిక భాగస్వామ్యంతో ‘షింకన్‌సెన్‌’ విధానంలో రూపుదిద్దుకుంటున్న దేశపు మొట్టమొదటి ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో మొదటి విడత (ఫస్ట్ సెక్షన్) సర్వీసులను వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటితో పాటు ఢిల్లీ-వారణాసి-పాట్నా కారిడార్ కూడా ఖరారైందని, ఇది పూర్తయితే పాట్నా నుంచి ఢిల్లీకి కేవలం 4 గంటల 41 నిమిషాల్లోనే చేరుకోవచ్చని, భవిష్యత్తులో దీనిని సిలిగురి వరకు పొడిగిస్తామని వివరించారు.

రైల్వే మౌలిక వసతుల ఆధునీకరణ.. బిహార్‌కు 200 కొత్త రైళ్లు

హై-స్పీడ్ రైళ్లతో పాటు సాధారణ రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో కలిసి మంత్రి అశ్విని వైష్ణవ్ పలు కొత్త రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఛాప్రా జంక్షన్ – ఆనంద్ విహార్ టెర్మినల్, మౌ జంక్షన్-ఢిల్లీ, జహీర్‌ఘాట్-వారణాసి మార్గాలలో కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాబోయే 7 నుండి 8 ఏళ్లలో ఒక్క బిహార్ రాష్ట్రానికే 200కు పైగా కొత్త రైళ్లను కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి పుణె, చెన్నై, బెంగళూరు మార్గాల బుల్లెట్ రైలు కారిడార్ పనులు కూడా మొదలవుతాయని ఆయన పునరుద్ఘాటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

తమిళనాడులో విషాదం.. అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha