Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్‌ రీ-ఎగ్జామ్‌.. రహస్య ప్రాంతంలో ప్రశ్నపత్రాల పేపర్‌ తయారుచేసిన నిపుణులను

నీట్‌ రీ-ఎగ్జామ్‌.. రహస్య ప్రాంతంలో ప్రశ్నపత్రాల పేపర్‌ తయారుచేసిన నిపుణులను

వార్త 6 days ago

NEET UG re exam: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) రీ-ఎగ్జామ్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర అధికారులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

గత నెలలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈసారి ఎలాంటి లోపాలకు తావుండకూడదని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాద ప్రక్రియల్లో పాల్గొనే నిపుణులందరినీ జూన్ 21 వరకు ఒక రహస్య ప్రాంతంలో గృహనిర్బంధం (లాక్‌డౌన్‌)లో ఉంచారు.

Read also: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో సరికొత్త మార్పు

 NEET re-exam.. Experts who prepared question papers in a secret area

NEET UG re exam: బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్..

ప్రశ్నపత్రాలు తయారు చేసే సబ్జెక్ట్ నిపుణులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలను అధికారులు పూర్తిగా తెంచివేశారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రతా సిబ్బంది ముందే స్వాధీనం చేసుకున్నారు. వారు బస చేసిన రహస్య కేంద్రంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఆ కేంద్రంలోకి ఇతర వ్యక్తులు ఎవరికీ ప్రవేశం లేదు. లోపలికి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలను అధికారులు సీసీటీవీల ద్వారా నిరంతరం రికార్డు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో పేపర్ రవాణా?

ఈ ఐసోలేషన్ ప్రక్రియ భద్రతా వలయంలో కేవలం మొదటి అంచె మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రవాణా వరకు ప్రతి దశను అత్యంత కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం గొలుసుకట్టు ప్రక్రియలో ఏ ఒక్క వ్యక్తికీ పూర్తి సమాచారం తెలియకుండా వ్యవస్థను వివిధ విభాగాలుగా విభజించారు. అంతేకాకుండా, పేపర్ లీకేజీలను అరికట్టడానికి మరియు సురక్షితమైన రవాణా కోసం ఈసారి భారత వైమానిక దళం విమానాలను ఉపయోగించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు.

జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్..!

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు సాంప్రదాయ పెన్-పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలో జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 551 నగరాల్లో ఈ పరీక్షను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గత పరీక్షలో జరిగిన లోపాలను, వైఫల్యాలను పూర్తిగా సరిదిద్ది.. ఈసారి ఎలాంటి చిన్న అవకతవకలకు తావులేకుండా పరీక్షను వంద శాతం పారదర్శకంగా పూర్తి చేయడం ఎన్‌టీఏకు ఒక అగ్నిపరీక్షగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha