NEET Re-exam Cheating: దేశవ్యాప్తంగా ఇప్పటికే 'నీట్' (NEET) పరీక్షల చుట్టూ వివాదాలు నడుస్తుండగా, తాజాగా హైదరాబాద్‌లో ఒక విస్తుగొలిపే ఉదంతం వెలుగుచూసింది.
నీట్ రీ-ఎగ్జామ్ (పునఃపరీక్ష) రాస్తూ అత్యంత చాకచక్యంగా కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాగన్నగూడలోని జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పరీక్షా కేంద్రంలో ఈ హైటెక్ మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం కలకలం సృష్టించింది.

Read also: Ponnam Prabhakar: నీట్ విద్యార్థులు ఉచిత బస్సు సేవల వినియోగంపై పొన్నం ప్రభాకర్ ఆనందం వ్యక్తం
పక్కా ప్లాన్‌తో ఫోన్ దాచిపెట్టాడు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన సదరు విద్యార్థి పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ముందే ఒక ప్లాన్ వేసుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కావలసి ఉండగా, అతను ఉదయం 7 గంటలకే సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్కూల్ వాష్‌రూమ్ వెంటిలేటర్‌లో తన స్మార్ట్‌ఫోన్‌ను దాచాడు. ఆ తర్వాత యథావిధిగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక, మళ్లీ వాష్‌రూమ్‌కు వెళ్లి ఆ ఫోన్‌ను ఒక జిప్ లాక్ కవర్‌లో పెట్టి, ఎవరికీ దొరకకుండా టాయిలెట్ ఫ్లష్ ట్యాంకు లోపల దాచిపెట్టాడు.
NEET Re-exam Cheating: కడుపునొప్పి అంటూ డ్రామా.. చివరికి సీన్ రివర్స్!
పరీక్షా సిబ్బంది రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీలు చేసినా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ఆ విద్యార్థి తనకు కడుపునొప్పి వస్తోందంటూ ఇన్విజిలేటర్‌ను నమ్మించి వాష్‌రూమ్‌కు అనుమతి తీసుకున్నాడు. అయితే, వెళ్లిన విద్యార్థి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చింది.
వెంటనే వారు వాష్‌రూమ్ వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సదరు విద్యార్థి దాచిపెట్టిన ఫోన్ తీసి ఇంటర్నెట్‌లో సమాధానాలు వెతుకుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పరీక్షా కేంద్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనున్న స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

