Deputy CM Bhatti : తెలంగాణ క్రీడారంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్రంలో యువ ప్రతిభను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'TG20 క్రికెట్ లీగ్' అట్టహాసంగా ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఆరంభ వేడుకలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న అద్భుతమైన క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ఇలాంటి లీగ్‌లు ఒక గొప్ప వేదికగా దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : మహబూబ్ నగర్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

క్రీడలకు రేవంత్ సర్కార్ పెద్దపీట.. త్వరలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ
రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పన, యువతను క్రీడల వైపు మళ్లించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని త్వరలోనే స్థాపించబోతున్నామని ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ, వసతులు లభిస్తాయని తెలిపారు. కాగా, ఎంతో ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ TG20 క్రికెట్ లీగ్ మొత్తం 21 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

