NEET UG 2026 Counseling Process : వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చే దిశగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక నిర్ణయాలు తీసుకుంది.
నీట్ యూజీ (NEET UG) కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు మేలు చేకూరేలా అనేక కొత్త నిబంధనలు మరియు సడలింపులను ప్రవేశపెట్టింది.
Read Also: RBI Repo Rate 2026: లోన్ యూజర్లకు గుడ్ న్యూస్
NEET UG 2026 Counseling Process
ముఖ్యమైన మార్పులు & కొత్త నిబంధనలు:
ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో తొలి రౌండ్‌లో సీటు పొంది, తదుపరి రౌండ్‌లో మెరుగైన కాలేజీ లేదా సీటు కోసం అప్‌గ్రేడేషన్ (Upgradation) ఎంచుకునే అభ్యర్థులు తమకు మొదట కేటాయించిన కళాశాలకు నేరుగా వెళ్లి భౌతికంగా రిపోర్ట్ (Physical Reporting) చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే సీటును అంగీకరిస్తూ, కాలేజీకి వెళ్లకుండానే తదుపరి రౌండ్ కౌన్సెలింగ్‌లో నేరుగా పాల్గొనవచ్చు. కేటాయించిన సీటును వదులుకోవాలనుకునే అభ్యర్థులు ఇకపై సంబంధిత కళాశాలకు వెళ్లి దరఖాస్తు చేయాల్సిన పనిలేదు. కౌన్సెలింగ్ పోర్టల్‌లోనే ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోగా సీటును రద్దు/రాజీనామా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద సీట్లు కోరుకునే విద్యార్థులు తమకు కావలసిన అన్ని పత్రాలను కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రతి వైద్య కళాశాల తమ వద్ద అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలను అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
NEET UG 2026 Counseling Process : రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్ ఏర్పాట్లు:
మరోవైపు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS), నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరియు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అందించిన అర్హుల జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ మరియు నోటిఫికేషన్‌ను త్వరలోనే అధికారులు విడుదల చేయనున్నారు.
Epaper: epaper.vaartha.com

