Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీఐ పేమెంట్లలో కీలక మార్పులు

యూపీఐ పేమెంట్లలో కీలక మార్పులు

వార్త 3 weeks ago

UPI Payments: భారత్ లో యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి. రూ.5 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. యూపీఐలో ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి.

తాజాగా మరో కీలక మార్పు తీసుకురానున్నారు. తాజా మార్పుతో ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఏ ఇతర యూపీఐ యాప్స్ లో ఇకపై మన ఫోన్ నంబర్ కనిపించదని చెబుతున్నారు. యూపీఐ ఐడీ, లేదా నంబర్ లోని చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. కస్టమర్ల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకొని నేషల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read also: DeMart's entry into the pharmacy business : డీమార్ట్ లో 20 శాతం డిస్కౌంట్ తో మందులు లభ్యం

 UPI payments

UPI Payments: ప్రైవసీ, భద్రతపై ఆందోళనలు

ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే, క్రెడ్, భీమ్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకురానున్నారు. డిజిటల్ పేమెంట్స్ సమయంలో కస్టమర్ల ఫోన్ నంబర్ పూర్తిగా కనిపించకుండా చేసే విధానంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా పని చేయనుంది. ప్రస్తుతం యూపీఐ ట్రాన్సక్షన్స్ మొబైల్ నంబర్ ద్వారా కస్టమర్లను గుర్తిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఫోన్ నంబర్లు ఇతరులకు కనిపించడం వల్ల ప్రైవసీ, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మెట్రోలో సీఎం విజయ్.. ఫ్యాన్స్ హ్యాపీ..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha