Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వార్త 3 weeks ago

SC On NEET Re Exam : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG 2026) పరీక్ష వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో మాదిరిగానే సాంప్రదాయ ఓఎంఆర్ (OMR) షీట్ విధానంలోనే పెన్ అండ్ పేపర్ మోడ్‌లో పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరిసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తుది ఆదేశాలు ఇచ్చింది.

ఆచరణాత్మకంగా అసాధ్యం.. పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం

ఆర్జేడీ (RJD) ఎంపీ సుధాకర్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, పరీక్షా విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. పరీక్షకు చాలా తక్కువ సమయం ఉన్నందున, లక్షలాది మంది విద్యార్థులకు హఠాత్తుగా ఆన్‌లైన్ విధానంలో మార్పులు చేయడం ఆచరణాత్మకంగా కష్టమని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే పేపర్ లీకేజీ వివాదాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో కొత్త విధానాన్ని తీసుకురావడం మరింత గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది.

Read Also: Bengalur news: గర్భిణిని తీసుకెళ్తుంటే అడ్డుకున్న వీఐపీ కాన్వాయ్.. రోడ్డుపైనే భర్త నిరసన!

 SC On NEET Re Exam :

SC On NEET Re Exam : ఏఐ (AI) నిఘా, ఎన్‌క్రిప్టెడ్ పేపర్లు.. జులైలో తుది విచారణ!

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పిటిషనర్ సుధాకర్‌సింగ్ కోర్టుకు పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎన్‌క్రిప్టెడ్‌ క్వశ్చన్‌ పేపర్లు ఉపయోగించాలని, ఏఐ (AI) ఆధారిత నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా, నమ్మకం కోల్పోయిన NTA స్థానంలో సరికొత్త పరీక్షా అథారిటీని ఏర్పాటు చేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ చేసిన అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం, నీట్ పరీక్షల నిర్వహణలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అంగీకరించింది. ఈ సంస్కరణలపై పూర్తిస్థాయిలో మరియు సుదీర్ఘంగా జులై నెలలో విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది. అంతకుముందు మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో భారీ ఎత్తున అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఎన్‌టీఏ ఆ పరీక్షను రద్దు చేసి, జూన్ 21న పునఃపరీక్ష జరపాలని నిర్ణయించింది. ఈ లీకేజీ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు కాగా, కోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సామూహిక వేదికపై బీజేపీ ఎమ్మెల్యే వివాహం.. ఎడ్లబండిపై ఊరేగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha