Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సామూహిక వేదికపై బీజేపీ ఎమ్మెల్యే వివాహం.. ఎడ్లబండిపై ఊరేగింపు

సామూహిక వేదికపై బీజేపీ ఎమ్మెల్యే వివాహం.. ఎడ్లబండిపై ఊరేగింపు

వార్త 1 week ago

Chhattisgarh: రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పెళ్లిళ్లంటే సాధారణంగా కోట్ల రూపాయల ఖర్చు, విలాసవంతమైన ఏర్పాట్లు, ఆడంబరాలే గుర్తొస్తాయి. కానీ, వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఓ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ సామూహిక వివాహ వేదికపై నిరాడంబరంగా పెళ్లి చేసుకొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.

సరికొత్తగా, ఆదర్శవంతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఛత్తీస్‌గఢ్ వేదికగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా (Bemetara) నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు.. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు.

Read Also: Social Media Influencer Manshi: పెళ్లైన రెండేళ్లకే ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి.. వరకట్న వేధింపులే కారణమా?

 BJP MLA’s wedding on a public platform.. Procession on a bullock cart

Chhattisgarh: నిరుపేద జంటలతో కలిసి ఒకే వేదికపై..

బెమేతరా జిల్లాలో నిర్వహించిన ఈ సామూహిక వివాహ మహోత్సవం ఎన్నో ప్రత్యేకతలకు వేదికైంది. ఎమ్మెల్యే దంపతులతో పాటు మరో 20కి పైగా నిరుపేద జంటలు ఒకే వేదికపై వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాయి. ఈ పెళ్లికి ఎమ్మెల్యే దీపేష్ సాహు సాంప్రదాయబద్ధంగా ఎడ్లబండిపై ఊరేగింపుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకంటే విశేషం ఏమిటంటే.. ఆ ఎడ్లబండి తాళ్లను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ స్వయంగా చేతబూని నడపడం రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికి సామాన్యులతో కలిసి పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యేను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు.

నేటి యువతకు ఆదర్శం

ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. “నేటి కాలంలో పెళ్లిళ్ల ఖర్చుల కోసం కుటుంబాలు అప్పులపాలవుతున్న తరుణంలో.. దీపేష్ సాహు వేసిన ఈ అడుగు సమాజానికి ఒక గొప్ప సానుకూల సందేశాన్ని ఇచ్చింది. ఆయన నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని నేనే గతంలో ఆయనకు సూచించాను.”

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha