Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నోట్‌బుక్‌లోనే అసలు ప్రశ్నలు.. ప్రొఫెసర్ లీకేజ్ గుట్టు రట్టు చేసిన సీబీఐ!

నోట్‌బుక్‌లోనే అసలు ప్రశ్నలు.. ప్రొఫెసర్ లీకేజ్ గుట్టు రట్టు చేసిన సీబీఐ!

వార్త 1 week ago

NEET UG 2026 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కీలక పురోగతి సాధించింది.

ఈ భారీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి (కింగ్‌పిన్)గా భావిస్తున్న పుణెకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ (NTA) పరీక్షల ప్యానెల్‌లో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, తన పలుకుబడితో ప్రశ్నపత్రాన్ని ముందే దక్కించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

రహస్య క్లాసులు.. చేతిరాతతో లీకైన పేపర్

ఏప్రిల్ చివరి వారంలో ప్రొఫెసర్ కులకర్ణి పుణెలోని తన నివాసంలో కొంతమంది ఎంపిక చేసిన విద్యార్థులకు అత్యంత రహస్యంగా కోచింగ్ ఇచ్చారు. ఈ క్లాసుల్లో ఆయన నీట్ కెమిస్ట్రీ ప్రశ్నలను, వాటి ఆప్షన్లను, సరైన సమాధానాలను విద్యార్థులతో నోట్‌బుక్స్‌లో రాయించారు. మే 3న జరిగిన అసలు పరీక్షా పత్రంతో ఈ చేతిరాత నోట్స్ అక్షరం పొల్లుపోకుండా సరిపోలడం అధికారులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ రహస్య శిక్షణ కోసం విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.

Read Also : జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పై రేవంత్ స్పష్టత

 NEET UG 2026

బ్యూటీ సెలూన్ ఓనర్ అరెస్ట్.. జూన్ 21న రీ-ఎగ్జామ్

ఈ కుంభకోణంలో కులకర్ణికి సహకరించిన మనీషా వాఘ్మరే అనే మహిళను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. పుణెలో బ్యూటీ సెలూన్ నడిపే ఈమె, డబ్బున్న విద్యార్థులను దంగలముఠా వద్దకు చేర్చడంలో మధ్యవర్తిగా వ్యవహరించింది. రాజస్థాన్, మహారాష్ట్రల నెట్‌వర్క్‌తో కూడిన ఈ లీకేజీ వ్యవహారంలో కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నలు యథాతథంగా బయటకు రావడంతో మే 12న కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. కాగా, రద్దయిన నీట్ పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నేను తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తా - సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha