Husband assaulted on Wife: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఒక మహిళకు నరకం సాకారమైంది. నోయిడాకు చెందిన 27 ఏళ్ల సుచరిత సాహా అనే యువతి, తన భర్త హర్విందర్ చౌహాన్ తనను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ, శారీరకంగా దాడి చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది.
పెళ్లయిన కొన్ని రోజులకే హనీమూన్ ట్రిప్‌లో చంపేందుకు ప్రయత్నించాడని, తిరిగి వచ్చిన తర్వాత కూడా తీవ్రంగా కొట్టాడని ఆమె ఆరోపించడంతో ఈ దారుణ గృహ హింస ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుచరిత సాహాకు, హర్విందర్ చౌహాన్‌కు ఏప్రిల్ చివరి వారంలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్త నోయిడాలోని సుచరిత నివాసంలోనే ఆమెతో కలిసి ఉండటం ప్రారంభించాడు. అయితే, పెళ్లయిన మరుసటి రోజు నుంచే అసలు రంగు బయటపెట్టాడు. రోజూ ఆ మహిళను దారుణంగా కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం అలవాటుగా మార్చుకున్నాడు.
Read Also: Nizamabad crime: ప్రియుడితో కలిసి భర్తకు ఉరివేసి చంపిన భార్య!
Husband assaulted on Wife
Husband assaulted on Wife: హనీమూన్ ట్రిప్‌లో హత్యాయత్నం
వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత, మే 4న ఈ దంపతులు సిక్కిం, డార్జిలింగ్ ప్రాంతాలకు హనీమూన్ కోసం వెళ్లారు. అక్కడ కూడా హర్విందర్ చౌహాన్ ప్రవర్తనలో మార్పు రాలేదు సరే కదా, హింస మరింత పెరిగింది. మే 9న హనీమూన్ హోటల్ గదిలో గొడవపడి, సుచరితను మెట్లపై నుంచి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె మోకాళ్లు, తల, మరియు వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలోనే ఆమెను ప్రాణాలతో విడవనని చంపేస్తానని బెదిరించాడు. మే 10న నోయిడాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా భర్త హింస కొనసాగింది. ఈ దారుణాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సుచరిత గట్టిగా చెప్పడంతో హర్విందర్ మరింత రెచ్చిపోయాడు. ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టి పగలగొట్టాడు. అనంతరం ఆమె పొట్టలో బలంగా తన్నుతూ, చెంపదెబ్బలు కొడుతూ తీవ్రంగా గాయపరిచాడు. పోలీసుల వద్దకు వెళ్తే చంపేస్తానని హెచ్చరించి, ఆపై ఢిల్లీలోని తన తల్లిదండ్రుల ఇంటికి పారిపోయాడు. మానసిక, శారీరక అణచివేత నుండి కోలుకున్న బాధితురాలు మే 28న నోయిడా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్త హర్విందర్ చౌహాన్‌పై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని, దర్యాప్తులో తేలిన వాస్తవాలను బట్టి నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.
read also:

