Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

వార్త 3 weeks ago

NTPC Recruitment: దేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఖాళీగా ఉన్న 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలన్నీ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన (మూడేళ్లు, మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది) భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.

Read Also :RBI JE Recruitment 2026: ఆర్బీఐలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

 250 Assistant Executive Jobs in NTPC

NTPC Recruitment: అర్హతలు

  • విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ (B.E) లేదా బీటెక్ (B.Tech) (ఎలక్ట్రికల్/మెకానికల్) విభాగాల్లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (SC/ST/PwBD అభ్యర్థులు కేవలం పాస్ మార్కులతో దరఖాస్తు చేసుకోవచ్చు).
  • అనుభవం: అభ్యర్థులకు 40 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్‌లో ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్‌లో కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం, ఎంపిక ప్రక్రియ

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 55,000 (Fixed Consolidated) జీతంతో పాటు హెచ్‌ఆర్ఏ (HRA), నైట్ షిఫ్ట్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు లభిస్తాయి.

  • ఎంపిక విధానం: అభ్యర్థుల దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (రాత పరీక్ష) వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
  • దరఖాస్తు రుసుము: జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 500. మహిళలు, SC/ST, PwBD మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది.
  • చివరి తేదీ: మే 7, 2026.
  • అధికారిక వెబ్‌సైట్: careers.ntpc.co.in
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha