Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం: తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి

రేవా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం: తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి

వార్త 3 weeks ago

Rewa Pregnant Woman Death : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ప్రభుత్వ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (GMH)లో ప్రసవం కోసం చేరిన కల్పనా మిశ్రా అనే గర్భిణితో పాటు నవజాత శిశువు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.

ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన తన కుమార్తె, “నాన్నా వీళ్లు నన్ను చంపేస్తారు.. కాపాడు” అంటూ భయంతో వేడుకుందని ఆమె తండ్రి రామ్‌శిరోమణి మిశ్రా ఆరోపించారు. ప్రసవం కోసం రూ.30 వేలు లంచం ఇవ్వాలని నర్సులు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో విషం ఇంజెక్షన్ ఇస్తామని బెదిరించినట్లు తెలిపారు.

Read Also: Tirupati Accident: తిరుపతి జిల్లాలో ప్రమాదం: లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు!

 Rewa Pregnant Woman Death


Rewa Pregnant Woman Death : వైద్యులు, నర్సుల నిర్లక్ష్యమే కారణమా?

మళ్లీ బలవంతంగా ఆమెను డెలివరీ రూమ్‌లోకి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆపరేషన్ చేశారని, ఆ తర్వాత మృత శిశువు జన్మించిందని కుటుంబసభ్యులు తెలిపారు. కాసేపటికే కల్పన కూడా ప్రాణాలు కోల్పోగా, ఆపరేషన్ చేసిన వైద్యురాలు, సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారని బాధితురాలి తండ్రి చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఆరోపణలను జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా ఖండించారు. గర్భధారణ సమయంలో మహిళకు సరిగ్గా వైద్య పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. అధిక రక్తపోటు, వేగంగా గుండె కొట్టుకోవడం మరియు మస్తిష్క సంబంధిత సమస్యల వల్ల మహిళ మానసిక స్థితి దెబ్బతిని ఆందోళనకు గురైందని వివరించారు. ఆ భయంతోనే ఆమె అలా అసాధారణంగా ప్రవర్తించి ఉండవచ్చని, తమ వైద్య బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ తల్లీబిడ్డలను కాపాడలేకపోయామని పేర్కొన్నారు.

కాకినాడలో దారుణం: వివాహేతర సంబంధం కారణంగా జిమ్ ట్రైనర్ కిరాతక హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha