Bhiwadi Mother Made Infant Drink Acid: రాజస్థాన్‌లోని భివాడి (Bhiwadi) లో గుండెలవిసే దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే ఎనిమిది నెలల పసికందు అని కూడా చూడకుండా ఘోరానికి ఒడిగట్టింది.
తన సొంత కూతురితో బలవంతంగా యాసిడ్ తాగించినట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. భివాడిలోని 'కెప్టెన్ చౌక్' ప్రాంతంలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది.
Read Also :Kavadiguda Spa Center Murder: కవాడిగూడ స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త!
ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందు
యాసిడ్ తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది నెలల ఆడబిడ్డను వెంటనే ఆల్వార్‌లోని పిల్లల ఆసుపత్రికి (Alwar Children’s Hospital) తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా (Critical Condition) ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలో చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Bhiwadi Mother Made Infant Drink Acid: తండ్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే?
ఈ ఘోరం జరిగిన సమయంలో చిన్నారి తండ్రి మోహిత్ ఆఫీసులో ఉన్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం: “నేను కంపెనీలో పనిలో ఉన్న సమయంలో మా అక్క ఫోన్ చేసి.. నా కూతురు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, ఏదో మింగేసిందని చెప్పింది. దాంతో నేను కంగారుగా వెంటనే కంపెనీ నుంచి ఇంటికి పరుగెత్తుకొచ్చాను. నా కూతురికి కేవలం ఎనిమిది నెలలే. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ, నా భార్యే నా బిడ్డతో బలవంతంగా యాసిడ్ తాగించిందని తెలుస్తోంది.” – బాధిత తండ్రి మోహిత్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కన్నతల్లి అంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

