Bandla Ganesh Counter to Prakash Raj: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది.
పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే నెట్టింట కౌంటర్లు ఇస్తుండగా.. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పవన్ కల్యాణ్ పరమ భక్తుడు బండ్ల గణేష్ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read also: Peddi Movie: 'పెద్ది' లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు పేపర్లు ఎగరేస్తూ సందడి చేసిన ఉపాసన
‘Are you a collector or a prime minister?’.. Bandla Ganesh’s counter to Prakash Raj!
Bandla Ganesh Counter to Prakash Raj: వివాదానికి కారణమైన ప్రకాష్ రాజ్ ట్వీట్
రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, తానే స్వయంగా రాష్ట్రమంతా తిరుగుతానని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామంపై ప్రకాష్ రాజ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందిస్తూ.. ఎక్కడా పవన్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. “మీరొస్తానంటే మేమొద్దంటామా..? రండి దొర.. కానీ వచ్చే ముందు.. ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదంటే సింగిల్‌గా వస్తున్నారా..? అది చెప్పి రండి” అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
‘నువ్వేమైనా దేశ ప్రధానివా?’.. బండ్ల గణేష్
ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్‌కు బండ్ల గణేష్‌కు గట్టిగా సురుకు అంటుకుంది. ఏమాత్రం ఉపేక్షించకుండా ట్విట్టర్ వేదికగానే ప్రకాష్ రాజ్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. “నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం..? అసలు నువ్వెవడివి..? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా..? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి..?” అంటూ బండ్ల గణేష్ నిలదీశారు. “ప్రతి ఊర్లో, ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా..? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. పని లేకపోతే చూసుకో. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్” అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో తీవ్రంగా మండిపడ్డారు.
బండ్ల గణేష్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్‌ను ఎవరు ఏమన్నా ఊరుకునే ప్రసక్తే లేదని బండ్ల గణేష్ మరోసారి నిరూపించారంటూ జనసైనికులు ఈ పోస్ట్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ ట్వీట్ల యుద్ధం నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

