Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. భువీ రీఎంట్రీ

న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. భువీ రీఎంట్రీ

వార్త 2 weeks ago

Bhuvneshwar Kumar: న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ(BCCI) మంగళవారం ప్రకటించింది.

బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సెలక్టర్లు జట్టును ఖరారు చేశారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా ఈ సందర్భంగా సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read also: IND vs WI 1st T20: వెస్టిండీస్‌తో తొలి టీ20.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్‌

భువీ రీఎట్రీ

వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు దాదాపు నాలుగేళ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు ఇచ్చారు. 2022 న్యూజిలాండ్ సిరీస్ తర్వాత జట్టుకు దూరమైన 36 ఏళ్ల భువీ.. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా జెర్సీలో కనిపించనున్నాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా ఆర్సీబీ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్‌.. 30 ఇన్నింగ్స్‌ల్లో 45 వికెట్లు తీసి తన సత్తాను చాటుకున్నాడు. యూపీ టీ20లోనూ 14 వికెట్లు పడగొట్టి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.

బుమ్రాకు విశ్రాంతి.. వరుణ్ చక్రవర్తికి చోటు

భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ టీ20 సిరీస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. రాబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడిని వన్డేలకు సిద్ధం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పక్కటెముకల గాయం కారణంగా వెస్టిండీస్ సిరీస్, ఆసియా క్రీడలకు దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. అక్టోబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha