IND vs WI 1st T20: లక్నో వేదికగా తొలి టీ20లో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
కాగా ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ చేతుల మీదగా ఇండియన్ క్యాప్‌ను అందుకున్నాడు. అతడు ఇప్పటికే వన్డేల్లో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే.
Read also: IND vs WI T20: వెస్టిండీస్‌కు అభిషేక్ శర్మ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్
అంతా ఊహించిందే జరిగింది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో వైభవ్ అద్భుతంగా రాణించినప్పటికీ జట్టు కూర్పు వల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది. టీమ్ మేనెజ్‌మెంట్ ఎప్పటిలాగే సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను ఓపెనింగ్ జోడీగా కొనసాగించింది.

టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులు, మ్యాచ్ సాగే కొద్దీ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఛేజింగ్‌కే మొగ్గు చూపినట్లు తెలిపాడు. దీంతో విండీస్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి.
తుది జట్లు
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (కెప్టెన్), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, షమర్ స్ప్రింగర్, షమర్ జోసెఫ్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్
Epaper: epaper.vaartha.com

